
అంజలీను జై మాటలతో మాయ చేసాడు: ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు హీరోయిన్ అంజలీ తమిళ నటుడు జైతో ప్రేమలో ఉందని ఆ మధ్య పుకార్లు జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారని కూడా ప్రచారం అయింది. "ఎంగేయుమ్ ఎప్పోదుం" అనే సినిమాతో మొదలైన వీరి ప్రేమాయణం కొన్నాళ్ళు సాగిన ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ముగిసింది. అయితే తాజాగా ప్రొడ్యూసర్ నందకుమార్ ఈ జంటపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నందకుమార్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలో జై, అంజలీ నటించారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ..."అంజలీ చాలా మంచి అమ్మాయి. కానీ అలాంటి అమ్మాయిని కూడా జై మార్చేసీ ఎన్నోసార్లు షూటింగ్ కు భంగం కలిగించాడని ఆరోపించారు. కోడైకనల్ లో షూటింగ్ చేస్తుండగా...డైరెక్టర్ షాట్ రెడీ అయిందని అంజలీను మేడమ్ అని కాకుండా పేరు పెట్టి పిలిచాడు. దాన్నీ అంజలీ పెద్దగా పట్టించుకోలేదు కానీ జై పెద్ద గొడవ చేసి, షూటింగ్ ఆపేస్తానని ఛాలెంజ్ చేసాడు. ఆ తర్వాత అంజలీతో కడుపు నొప్పి ఉందని చెప్పు అని చెప్పించి షూట్ క్యాన్సల్ చెప్పించాడు. అంతేకాక వారి ఇద్దరి కోసమని 5స్టార్ హోటల్ లో రెండు రూమ్లు తీసుకుంటే...ఇద్దరు ఒకే రూమ్ ను వాడుకునేవారు. అప్పుడు ఒక్కో రూమ్ కు రోజుకు రూ.12000/- కట్టేవాళ్ళం అందుకని మీరు ఒక రూమ్ క్యాన్సిల్ చేయండని అడిగితే...దానికి ఇద్దరు నిరాకరించారని ఆరోపించారు.