
రాజధాని శివారు శంషాబాద్లో అంతగా జనసంచారం లేని ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం మంటల్లో కాలిపోతు కనిపించింది. రెండు దుర్ఘటనలు మధ్య దాదాపు కిలోమీటరు దూరమే ఉంటుంది. రాళ్లగూడా సమీపంలోని సిద్ధులగుట్ట దారిలో బంగారు మైసమ్మ ఆలయం ప్రహరీ వెనుక భాగాన్ని అనుకుని ఓ మహిళ మంటల్లో దహనమవుతున్నట్లుగా కొందరు గుర్తించి ఆపేందుకు ప్రయత్నించారు. రాత్రి 8.30 గంటలకు 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. క్లూస్ టీమ్ సభ్యులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలంకి చేరుకున్నారు. ఆ మృతదేహం 30-35 ఏళ్ల మధ్య గల మహిళదని గుర్తించారు. మహిళ ఒంటి పై నారింజ రంగు చీర ఉంది. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడీజీ, ఏసీపీ అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పరిశీలించారు. నిర్మానుష్య ప్రదేశం కావడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆధారాలు సంపాదించడం కష్టమవుతుందని తెలిపారు పోలీసులు.