
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమంకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో జాయిన్ అవ్వనున్నాడు దగ్గుబాటి అభిరామ్. ఆ మధ్య నటి శ్రీరెడ్డి పుణ్యమా అని వార్తల్లో నిలిచాడు. నాతో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ అభిరామ్ తో దిగిన ఫోటోలను సైతం రిలీజ్ చేసి సంచలనాలకు తెర తీసింది. ఇప్పుడు మళ్లీ అభిరామ్ పేరు వినిపిస్తుంది. అయితే అది ఎఫైర్ తోనే మరి ఏదో కాదు సినిమా అరంగేట్రం చేయనున్నాడు. అది కూడా సంచలన సినిమా అయిన 'అసురన్' రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా....వెంకటేష్ రెండో కుమారుడిగా అభిరామ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. సినిమాలో రెండో కుమారుడి పాత్ర కీలకంగా ఉండటంతో ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.