
తమిళంలో రిలీజ్ అయిన "96" భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. తమిళ్ '96'ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా... తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. సమంత, శర్వానంద్‌లు సినిమా చేస్తున్నారనే సరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్ర యూనిట్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ చూస్తుంటే సమంత, శర్వాకు హిట్ పక్కా అన్నట్టుగా ఉంది. జానుగా సమంత, రామ్ గా శర్వా పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్ననాటి ప్రేమ పెరిగి పెద్దయ్యాక ఎలాంటి మలుపులు తీసుకుందనేదే కధ. ఎమోషనల్ డైలాగ్స్ తో, ఇద్దరి లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మార్చ్ లో రిలీజ్ చేసేందుకు బృందం ప్లాన్ చేస్తుంది.