
మహేష్ బాబు, రష్మీక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో కామెడీకి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని చెప్తున్నారు చిత్ర బృందం. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రతి సోమవారం సినిమాకు సంబంధించిన ఏదోక అప్డేట్ ఇస్తూ వచ్చారు. ఇక టైం మరింత దగ్గరపడటంతో సోమవారం కాకపోయినా సరే సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సోషల్ మీడియాలో తమన్నా మహేష్ తో స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ ప్రోమోను నేడు సాయంత్రం 7:02గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమన్నా గ్లామర్, డాన్స్ లో గ్రెస్ సినిమాకే హైలెట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.