
మల్లు బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ను వెబ్ సిరీస్ కోసం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా టీం సంప్రదించింది. ఇప్పుడు ఆమె డిమాండ్ మేకర్స్ కు భారీ షాక్ ఇస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. నటి అను ఇమ్మాన్యుయేల్ వెబ్ సిరీస్ కోసం ఎపిసోడ్‌కు రూ .2 లక్షల వేతనం కోట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించడానికి ఒక నూతన దర్శకుడు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మలయాళీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించి ఆమెతో చర్చలు ప్రారంభించారు. మరి మేకర్స్ అను కోట్ చేసిన వేతనంకు ఒప్పుకొని వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తారా...లేదా మరో భామను వెతుకుతారా అనేది చూడాలి.