
'సూపర్' సినిమాతో మొదలైన అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ ప్రయాణం ఎంతో ఎత్తుకు ఎదిగింది. సైజ్ జీరో, బాహుబలి లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనదైన శైలిలో అందరిని మెప్పించింది టాలీవుడ్ దేవసేన. అయితే బాహుబలి తర్వాత ఎంతో గ్యాప్ తీసుకొని కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లో కాకుండా ఓటిటిలో 'నిశ్శబ్దం' సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికి నెమ్మదిగా పుంజుకుని ఓ మోస్తరుగా ఆడింది. అయితే నిశ్శబ్దం రిలీజ్ అయిన కొన్నిరోజులకే అనుష్క శెట్టి కొత్త సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ ఆమె పుట్టినరోజు నాడు ఏదొక ప్రకటన వస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ ఆమెతో పని చేసిన దర్శక-నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు ఎవ్వరు తన తదుపరి ప్రాజెక్ట్ పై ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ ఏది జరగలేదు. దింతో ఆమె ఏ సినిమాకు సైన్ చేయలేదని అర్ధం అవుతుంది. మరి ఇకపై సినిమాల్లో నటించదా?? పెళ్లి చేసుకోబోతుందా? అనేది తెలియాల్సి ఉంది.