
సుదీర్ఘ గ్యాప్ తరువాత, అనుష్క శెట్టి ఏప్రిల్ 2న థియేటర్లలోకి 'నిశ్శబ్దం' చిత్రంతో రాబోతోంది. సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, అనుష్క శెట్టి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా మారింది. ఎందుకంటే ఆమె నిశ్శబ్దంలో ప్రధాన పాత్ర పోషించినందుకు రెమ్యునరేషన్ గా రూ. 2.5 కోట్లు అందుకుంది. బాహుబలి, రుద్రమదేవి ఫేమ్ అనుష్క శెట్టి తన నిశ్శబ్దం నిర్మాత నుంచి జిఎస్టి మినహా రూ. 2.5 కోట్లు వసూలు చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, కాజల్ అగర్వాల్ మరియు నయనతార తెలుగు నిర్మాతల నుండి రూ. 1.5 కోట్లు వసూలు చేస్తూ..అనుష్క తర్వాత టాప్ లో నిలిచారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న నిశ్శబ్దం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అనుష్క సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లు వినికిడి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను అనుష్క త్వరలో మొదలు పెట్టనుంది.