
నటి అనుష్క శర్మ తక్కువ సినిమాలు చేసినప్పటికీ భారీ ఆదరణ పొందింది. అదే సమయంలో టీమ్ఇండియా క్రికెటర్ కోహ్లీతో ఉన్న ప్రేమను వివాహంతో మరింత హైలైట్ చేశారు. గత 3నెలలో ఈ జంట తమ లాక్డౌన్ కథలను అందమైన చిత్రాలతో, వీడియోలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభిమానులతో నెటిజెన్లతో పంచుకున్నారు. దీంతో వీరి ప్రేమానురాగాలు చూసి అభిమానులు వారి నుంచి తల్లిదండ్రులు కాబోతున్నామన్న శుభవార్త కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అభిమానుల కోరిక బలంగా ఉందేమో, చాలా కాలం క్రితం నుండి వారు వినాలనుకున్న వార్తను ఇప్పుడు విన్నారు. తాజాగా, అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తమకు ఒక బిడ్డ రాబోతుందని ప్రకటించారు. అనుష్క పెరిగిన పొట్టతో దంపతులు పోజ్ ఇచ్చి ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ప్రకటనతో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులు మరియు అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.