
బాహుబలి హీరోయిన్ అనుష్కశెట్టి నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం' అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఓటిటిలో రాబోతుంది. భాగమతి సినిమా తర్వాత అనుష్క మరెందులోను కనిపించలేదు. చాలా కాలానికి ఈ సినిమాతో కనిపించబోతుండటంతో నిశ్శబ్దంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చినప్పటికీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యమని భావించిన యూనిట్ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ తో ఒప్పొందం కుదుర్చుకొని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. అయితే ఓటిటిలోనే విడుదల అవుతున్నా సరే ప్రి రిలీజ్ ప్రొమోషన్ చాలా అవసరం. ఈమేరకు అనుష్క మీడియాతో వీడియో కాల్ నిర్వహిస్తుందని ఉహించిన మీడియా వారికి పెద్ద షాక్ ఇచ్చింది స్వీటీ. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్లో భాగంగా అనుష్క తెలుగు మీడియా తో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ ని జూమ్ తో ఏర్పాటు చేసారు. అందరూ అనుష్క కనపడి తమతో మాట్లాడుతుందని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేవలం వాయిస్ ఆప్షన్ నే ఎంచుకున్నారు.దాంతో జూమ్ కాల్ లో హాజరైన మీడియా వారందరికీ ఆమె వాయిస్ మాత్రమే వినపడింది. ఆమె ముఖం కనపడలేదు. ఈ విధంగా జరుగుతుందని వారు ఉహించలేదు. అలా అనుష్క ఎందుకు చేసిందనే విషయం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.