
అనుష్క శెట్టి, మాధవన్ ప్రధాన పాత్రల్లో కోనా వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన 'నిశ్శబ్దం' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందాని ఎదురుచూస్తుంటే, ఎట్టకేలకు ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న మన ముందుకొచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన నిమిషం నుంచి మిక్స్డ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఈ రివ్యూస్ చూస్తుంటే 'నిశ్శబ్దం' మరో 1- నేనొక్కడినే లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా అంతే కాస్త ఇంటలిజెంట్ గా ఉండేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. నిశ్శబ్దంకు కూడా అందుకే మిక్స్డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇది ఇంటలిజెంట్ ఎమోషనల్ థ్రిల్లర్. ఎందుకో ఫుల్ రివ్యూ చూడండి.
కథ: ఈ కథ సీయాటెల్‌లోని ఒక హాంటెడ్ ఇంట్లో సెట్ చేయబడింది. 1970 లో, ఒక జంట విచిత్రమైన పరిస్థితులలో ఆ ఇంట్లో మరణిస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత, సాక్షి (అనుష్క) మరియు ఆంథోనీ (మాధవన్)ల జంట ప్రతిష్టాత్మక పెయింటింగ్ కోసం అక్కడకు వస్తారు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనలలో, ఆంథోనీ చంపబడతాడు మరియు సాక్షి అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఈ కేసును పోలీసులు మహా (స్వాతి), రిచర్డ్ (మిచెల్ మాడ్సెన్) కు అప్పగిస్తారు. ఆంథోనీని ఎవరు చంపారు? సాక్షితో అతని సంబంధం ఏమిటి? మరియు మహా కేసును ఎలా పరిష్కరిస్తుంది అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
- హాలీవుడ్ లెవెల్ విజువల్స్
- అనుష్క నటన, లుక్స్
- మాధవన్ స్క్రీన్ ప్రసేన్స్, నటన
- సుబ్బరాజు పాత్ర హై లైట్
- డైరెక్షన్, స్క్రీన్ ప్లే
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడ బోర్ కొట్టే సీన్లు
- కాస్త స్లో అయిన సెకండ్ హాఫ్
విశ్లేషణ:
సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ప్రెడిక్టబుల్ స్టోరీ అని వినిపిస్తుంది. నిజానికి కథ కొంచెం రొటీన్ అవొచ్చు కానీ దాన్ని డైరెక్టర్ హేమంత్ మధుకర్ మల్చిన విధానం చాలా బాగుంది. నిశ్శబ్దం చూస్తే డైరెక్టర్ హేమంత్ కు అవుట్ ఫుట్ ఎలా రావాలనే దానిపై ఎంత క్లారిటీ ఉందో అర్ధం అవుతుంది. హాలీవుడ్ లో అయినా ఇంటలిజెంట్ సినిమాలు చాలా వరకు స్లోగానే సాగుతాయి. అలాంటి సినిమాల్లో నిశ్శబ్దం ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు. ట్విస్ట్‌లను ఒకొక్కటిగా రివీల్ చేసిన విధానానికి డైరెక్టర్ ని మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ లో సినిమాలు చిత్రకరించే విధానం మారుతుంది, రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసే రోజులు పోయాయి అని ఇలాంటి సినిమా చూస్తేనే అనిపిస్తుంది. ఇంత సీరియస్, ఆకట్టుకునే సస్పెన్స్ కథలో కూడా కుదిరినంత మేర కామెడీని జోడించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంత ఏమవుతుంది ఏమవుతుందని చూస్తే...ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రశ్నలకు సెకండ్ హాఫ్ లో ఎంతో చక్కగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రక్రియలో ఒకటి రెండు చోట్ల ఇది అవసరం లేదేమోనని అనిపించినా అవి మిహాయించొచ్చు. ఎన్నో రోజుల తర్వాత అనుష్క శెట్టిని చూస్తున్నామన్న ఆనందంతో ఆమెను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పాత్ర కోసం ఆమె సైన్ లాంగ్వేజ్ నేర్చుకుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆమె నటన గురించి ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? కళ్ళతోనే అన్ని కన్వే చేసేస్తోంది. ఇక మాధవన్ తన పాత్రకు కచ్చితంగా ప్రాణం పోసాడు. రకరకాల ఎమోషన్స్ లో పలికించడంలో ఆయనే దిట్ట. సుబ్బరాజు సినిమాకి మరో హై లైట్. సినిమాకు సుబ్బరాజు పాత్ర చాలా ముఖ్యం. చివరిగా అంజలి, షాలిని, మైకేల్ తమ తమ పరిమితి మేర బాగా నటించారు. నిర్మాత కోనా వెంకట్ ఈ సినిమాను ఎంత జాగ్రత్తగా నిర్మించారో ప్రతి సీన్ చెబుతుంది. సినిమాకు మేజర్ కాంట్రిబ్యూషన్ నిర్మాణ విలువలు.
ఒక్క మాట:
'నిశ్శబ్దం' హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన మరో ఇంటలిజెంట్ సస్పెన్స్ మూవీ.