
టాలీవుడ్ స్వీటీ, అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది? తన అందం, అభినయం, ప్రతిభతో అందరిని తన బుట్టలో పడేసుకొని భిన్నమైన పాత్రలు చేస్తూ..తనకు తానే సాటి అని నిరూపించుకుంది అనుష్క. స్టార్ హీరోల సరసన ఎంతటి గ్లామర్ రోల్స్ లో కనిపించిందో అంతే హుందాతో కూడిన పాత్రలు కూడా పోషించింది. అందుకే టాలీవుడ్ కు జేజమ్మ అయింది. ఇక అసలు విషయానికొస్తే అనుష్క తాజాగా గోదావరిలో బోటులో కనిపించారు. అయితే అది విహార యాత్ర కోసం కాదు.... పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయ సందర్శనార్ధం అనుష్క అక్కడ కనిపించారు. షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే తనకు ఈ కార్తీక మాసం ఇలా దర్శనం చేసుకునే అవకాశం రావటం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.