
భాగమతి సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలోనూ కనిపించలేదు. త్వరగా సినిమా చేయటం కన్నా మంచి సినిమా చేయటం ముఖ్యం అనుకున్న స్వీటీ చాలా సైలెంట్ గా తన తదుపరి సినిమాపై వర్క్ చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' లో అనుష్క నటిస్తుంది. పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా గురించి ఏ వార్త లేకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. అసలైతే ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అవ్వాల్సి ఉంది..కానీ అది కాస్త ఫిబ్రవరికు పోస్ట్ పోన్ అయింది. సరే, ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అనుకుంటే... అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో వాయిదా పడుతూ వాస్తు ఎట్టకేలకు ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.