
కొన్ని వారాల క్రితం, సౌత్ బ్యూటీ అనుష్క శెట్టి ఒక భారతీయ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో బలమైన ప్రచారం సాగింది. క్రికెటర్ పేరు వెల్లడించలేదు కాని వారు త్వరలో పెళ్లి పీటలేక్కే అవకాశం ఉందని కూడా పుకారు వచ్చింది. క్రికెటర్ దక్షిణ భారతీయుడు కాదని, ఉత్తరాదికి చెందినవాడు అని కూడా వినిపించింది. ఇది విన్న అందరూ షాక్ అయ్యారు. ఆమె అభిమానులు అయితే తమ అభిమాన నటి అనుష్క శెట్టి హృదయాన్ని దొంగిలించిన క్రికెటర్ ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చివరకు అనుష్క శెట్టి తన నిశ్శబ్దాన్ని విడి తన డేటింగ్ పుకారు గురించి నోరు విప్పింది. ఈ పుకార్లు పుట్టించిన వారిపై విరుచుకుపడింది. ఏదైనా మాట్లాడే ముందు నిజమా, కాదా తెలుసుకొండంటూ మండిపడింది. నేను క్రికెటర్ ను డేట్ చేస్తున్న అనేదాంట్లో ఎంత మాత్రం నిజం లేదంది. నా పెళ్లి విషయంలో మా తల్లిదండ్రులదే తుది నిర్ణయమని, వాళ్ళు చూసిన అబ్బాయిని త్వరలో పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.