
హైదరాబాద్ లో హఠాత్తుగా జిఎస్టీ అధికారులు ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సినీ నటి లావణ్య, ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లపై కూడా అధికారులు సోదాలు నిర్వహించారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై మీడియాలో రకరకాల కధనాలు రావటంతో సోషల్ మీడియా వేదికగా యాంకర్ అనసూయ మీడియాను ఏకిపారేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. జిఎస్టీ హెడ్ బాలాజీ ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన సమాచారం ప్రకారం...యాంకర్ అనసూయ మొత్తం చెల్లించాల్సిన టాక్స్ రూ.35లక్షలు కాగా ఇన్నేళ్లు కట్టకుండా ఉనందుకు వడ్డీ పడి రూ.35 లక్షలు కాస్త రూ.80లక్షలకు చేరింది. అందులో తాజాగా సోదాల తర్వాత రూ.25లక్షలు చెల్లించిందట. మిగితా రూ.55లక్షలు కట్టాల్సిందిగా ఆమెకు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇదే విషయం గురించి అనసూయను అడగగా...దానికి అజ్ఞానం కారణంగా తను నిర్ణీత మొత్తాన్ని చెల్లించలేదని చెప్పింది. తనకు తెలియజేయాల్సిన నిర్మాతలు కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని చెప్పింది.