
టాలీవుడ్ నటుడు రవితేజ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రవి తేజ రాబోయే చిత్రం ‘క్రాక్’ ప్రారంభం నుంచీ వార్తల్లో నిలించింది. అయితే సినీ సిర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేందుకు ఓ ముద్దుగుమ్మను రంగంలోకి దింపారు. ఆమె మరెవరో కాదు, ‘డేంజరస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అప్సర రాణి, రవితేజ కాప్ థ్రిల్లర్లో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని అప్సర రాణిను డైరెక్టర్ గోపిచంద్ అడగగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ఐటెమ్ సాంగ్ కు జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన క్రాక్ టీం మొన్నీమధ్యే మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు టీం ప్లాన్ చేస్తుంది. మరి కమర్షియల్ గా అన్ని యాంగిల్స్ ను కవర్ చేస్తున్న రవితేజకు ఈసారైనా హిట్ దక్కుతుందేమో చూద్దాం.