
ఈమధ్యకాలంలో బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెల్సిందే. మొన్నీమధ్యే ఎన్టీఆర్ బయోపిక్, మల్లేశం, వంగవీటి, జార్జ్ రెడ్డి లాంటి బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అమ్మగా భావించే దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జయలలిత బయోపిక్ ను ఇద్దరు, ముగ్గురు తెరకెక్కిస్తుండగా అందులో ఒకరు విజయ్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న "తలైవి" చిత్రంలో కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషిస్తుంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. శుక్రవారం ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎంజీఆర్ పాత్రకి అరవింద స్వామి కరెక్ట్ ఛాయిస్ అని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. 1965లో ఎంజీఆర్ ను తలపిస్తుంది యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్. ఇక ప్రకాష్ రాజ్ కరుణానిధిగా పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.