
ఇదివరకు సంగతి ఏమో గాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని చిన్న నటుల దగ్గర నుండి పెద్ద పెద్ద స్టార్ల వరకు ఎవరేమి చేస్తున్నారో తెలిసిపోతుంది. నటి, నటులు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అంతే టచ్ లో ఉంటున్నారు. అయితే సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రావెల్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్, క్లబ్‌లంటూ రచ్చ చేస్తుంటారు. తాజాగా బుల్లితెర గ్యాంగ్అం తా కలిసి పబ్‌లో వీకెండ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేశారు. మొత్తంగా ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. న్యూ ఇయర్‌కు అందరూ కలుసుకోలేకపోవడంతో ఇలా ఈ ఆదివారం నాడు రచ్చ చేస్తున్నామని సురేఖా వాణి చెప్పుకొచ్చింది. నా డార్లింగ్స్ సురేఖా వాణి, హేమ, ప్రవీణ కడియాల, రాజా రవీంద్ర, నటి జయలక్ష్మీతో కలిసి ఆది వారాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాని రజిత చెప్పుకొచ్చింది.