
'చిత్రం', 'నువ్వే నేను', 'జయం', 'నిజం' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తేజ చాలా ప్లాప్‌ల తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' తో తన పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులో బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ తేజ తాజా చిత్రం 'సీత' బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. గత సంవత్సరం, జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై సినిమా తీయాలని తేజ ఆలోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అతను ఆర్టికల్ 370ను బాలీవుడ్ హీరోతో చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ప్లాన్ మార్చుకొని ఒక తెలుగు సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా రానా దగ్గుబాటి విలన్ గా సరిపోయే కథనే సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలని తేజ ఆలోచిస్తున్నారని, దానికోసం రూ. 1.5 -2కోట్ల రెమ్యునరేషన్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరి కాజల్ అగర్వాల్ తేజకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.