లవర్ బాయ్ నాగశౌర్య యాక్షన్ హీరోగా మారాడు. నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అశ్వద్ధామ" చిత్రంలో మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు నాగశౌర్య. మొదటిసారి నాగశౌర్య సరసన మెహరిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపురి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది. సమంత అక్కినేని చేతుల మీదుగా టీజర్ విడుదల అవ్వడం విశేషం. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో అన్యాయాన్ని ఎదురుకొనే యువకుడిగా నాగశౌర్య కనిపిస్తున్నాడు. "గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలంటే కావాల్సింది ఆరడుగుల నారాయణాస్త్రం. ఒక అశ్వద్ధాముడు రావాలి" అనే డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా నాగశౌర్య మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు.