
బిగ్ బాస్ తెలుగు 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం రాత్రి బీర్ బాటిళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో జరిగింది. తాజా సమాచారం ప్రకారం, రాహుల్ సిప్లిగంజ్ ముక్కు మరియు తలకు స్వల్ప గాయాలయ్యాయి, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బిగ్ బాస్ 3 విజేతను డిశ్చార్జ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, రంగా రెడ్డికి చెందిన ఎమ్మెల్యే సహచరులు తనతో పాటు పబ్ కు వచ్చిన ఇద్దరు లేడీస్ పట్ల దురుసుగా ప్రవర్తించరాన్ని బీర్ బాటిళ్లతో దాడి చేశారని చెప్పారు. రాహుల్ సిప్లిగంజ్ ప్రకారం, అతను తన స్నేహితులతో కలిసి ఒక పబ్‌లో పార్టీని జరుపుకున్నాడు. ఆ సమయంలో పబ్‌లోని కొంతమంది వ్యక్తులు రాహుల్ సిప్లిగంజ్ గ్రూపులోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని మందలించేందుకు వెళ్లిన రాహుల్ పై ఎటాక్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తామని పోలీసులు తెలిపారు.