
బిగ్ బాస్ సీజన్ 4 గత వారం కొంత సప్పగానే సాగింది. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక తక్కువ రేటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. అందుకనే వారాంతపులో నాగార్జున వచ్చి ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు తొలిగించడానికి వీడియోలని అన్నా అవి వాళ్లలో వాళ్లకు చిచ్చులు పెట్టె విధంగానే ఉన్నాయి. ఇక నిన్న, మొన్న నామినేషన్ ప్రక్రియ నడవటంతో ఇల్లు హాట్ హాట్ గా మారింది. చాలా మంది అవినాష్ మరియు అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేసారు. అయితే అందరిలోకి అభిజీత్ చెప్పిన కారణాలు అవినాష్ కు నచ్చకపోవడంతో పెద్ద గొడవే జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అవినాష్ సోహెల్ తో మాట్లాడుతూ నేను ఈ ఇంట్లోకి ఎటువంటి అవమానాలు పడి వచ్చానో నాకు మాత్రమే తెలుసు. నన్ను ఆ షో వాళ్ళు వెళ్ళిపోమన్నారు నిన్ను ఇకపై ఈ స్టేజ్ ఎక్కనివ్వమని చెప్పాడు. అందుకే ఈ షో ద్వారా అవకాశాలు వస్తాయనే నమ్మకంతో వచ్చానని ఎమోషనల్ అయ్యాడు. అయితే అవినాష్ చెప్పింది ఫెమస్ జబర్దస్త్ కామెడీ షో గురించెనని అందరికి అర్ధమైంది. మరి జబర్దస్త్ నిర్వాహకులు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో?