
బిగ్ బాస్ సీజన్ 4 లో ఉహించని వాళ్ళందరూ కనిపించారు. కొంతమంది ఎవరో కూడా మొదట తెలియదు కాని పోను పోను ఆట పుంజుకొని ఎవరు ఏంటన్న విషయం తెలిసింది. అయితే అందరిలోకి ముక్కు అవినాష్ సూపరిచితుడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన అవినాష్ తనదైన కామెడీతో ఆకట్టుకొని అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే హౌస్ లోకి వెళ్లిన కొత్తలో బాగా ఎంటర్టైన్ చేసిన అవినాష్ ఈమధ్య తనకు ఎన్నో బాధలున్నాయని, అప్పులున్నాయి, మా అమ్మానాన్నలను నేనే చూసుకోవాలి, నన్ను ఆ షో వాళ్లు ఇంక రానివ్వవరు బయటకు వెళ్తే నా కెరియర్ ఏంటో తెలియదు అంటూ గత కొన్ని ఎపిసోడ్లలో ఇంటి సభ్యుల మీద అరుస్తూ, ఏడుస్తూ చెప్తూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి కానీ ఇక్కడ గేమ్ ఆడితేనే గెలుస్తారు కానీ కష్టాలు చెప్పి సింపథి క్రియేట్ చేస్తే గెలవరు. మరి అవినాష్ ఎందుకు గేమ్ కన్నా ఎక్కువ సింపథి మీద ఫోకస్ చేస్తున్నాడు? దాని వల్ల అతను ఎన్ని వారాలు సేవ్ అవుతాడు? చూడాలి.