
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి కానుకగా, వారు చేసిన సినిమాలు- 'అల...వైకుంఠపురములో' మరియు 'సరిలేరు నీకెవ్వరు' విడుదలై భారీ విజయాన్ని సాధించాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అల..వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మేకర్స్ కూడా తమ సినిమాలను ఇండస్ట్రీ హిట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. 'బాహుబలి'ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ సినీ ప్రేమికుల ట్వీట్‌పై స్పందించి, 'అల.. వైకుంఠపురములో', 'సరీలేరు నీకెవ్వరు’ సాధించిన ఇండస్ట్రీ హిట్ రికార్డ్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఒక సినీ లవర్ "సర్, మీరు ఎస్.ఎస్.రాజమౌళికి మంచి ఫ్రెండ్ కాబట్టి, రాబోయే మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కథ మీకు ఏమైనా తెలిసిందా? తెలిసి ఉంటే, అది ఎలా ఉంది, దాని బాక్సాఫీస్ పనితీరుపై మీ అంచనాలు ఏంటి ?" అని అడగగా.... దీనికి శోభు యార్లగడ్డ సమాధానం ఇస్తూ,“ లేదు, నేను ఒక్క రోజు మాత్రమే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి వెళ్ళాను. కథ నాకు తెలియదు కానీ, ఆర్ఆర్ఆర్ “*” లేకుండా “ఇండస్ట్రీ హిట్” అవుతుందని నాకు నమ్మకం ఉంది!" అని ట్వీట్ చేశారు. శోభు చేసిన ఈ ట్వీట్ పరోక్షంగా స్టార్ల సినిమాలపై సెటైర్ వేసిన్నట్లుగా ఉంది.