
విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం" ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ పరుశురాం తదుపరి చిత్రంపై రోజుకో పుకారు పుట్టుకొచ్చింది. విజయ్ దేవరకొండ తర్వాత కచ్చితంగా పెద్ద హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యి కధ రెడీగా ఉన్నా స్టార్ హీరోల డేట్ల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగిన పరుశురాం ఇక వాళ్ళ డేట్లు ఇప్పట్లో కష్టమని అర్థమై నాగచైతన్యతో కమిట్ అయ్యాడు. మరి కొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. స్టార్ హీరో అనుకోని మీడియం హీరోకి ఫిక్స్ అయిన పరుశురాం గీత గోవిందం అంత రేంజ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో పరుశురాంకు బడా ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నుంచి షాక్ ఎదురయ్యింది. తాను పరుశురాంకు 2008లో తన బ్యానర్ లో సినిమా చేసేందుకు రూ.28లక్షలు ఇచ్చానని కానీ అతను ఇప్పటి వరకు చెయ్యకుండా తప్పించుకుంటున్నాడని కంప్లైంట్ ఫైల్ చేశారు. 2008లో ఇచ్చిన అడ్వాన్స్ వడ్డీతో కలిపి అయిన రూ.6కోట్లు చెల్లించవల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.