
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇప్పటికే సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రావటంతో రాబోయే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటుంది. నిర్మాత బడ్జెట్ లిమిట్ పెట్టడంతో స్క్రిప్ట్‌ను తిరిగి రాస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే వెంచర్లో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనున్నారు. అఘోరా పాత్ర అనగానే, ఎవరి మనసులోనైనా వచ్చే మొదటి పేరు అనుష్క శెట్టి నటించిన లేడి సెంట్రిక్ చిత్రం అరుంధతి నుండి పసుపతి. అఘోరా పాత్రలో సోను సూద్ మరపురాని నటన కనబరిచారు. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అఘోరా పాత్రను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ అయిన బోయపాటి అఘోరా ఎపిసోడ్ ను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.