
కరోనా మహమ్మరికి ఎవరు ఏ క్షణాన బలవుతారో తెలియని పరిస్థితి. మన ఇంట్లో మనం ఉంటేనే సురక్షితంగా ఉండే అవకాశం. కానీ పని చేయకపోతే బండి ముందుకునడవదు. జాగ్రత్తలు పాటిస్తూ బండిని ముందుకు నెట్టాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ముందుచూపుగా ఇండస్ట్రీలోని వారికి హోమియో మందులు అందజేస్తున్నారు. బాలకృష్ణ నడిపిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరుపున నివారణ చర్యగా ఇండస్ట్రీలోని వారికి హోమియో మందులను అందజేశారు. అయితే అవి అందుకున్న వారిలో డైరెక్టర్ వివి వినాయక్ ఒకరు. ‘నన్ను గుర్తుపెట్టుకొని మరి బాలకృష్ణ గారు ఇవి పంపించినందుకు నా కృతజ్ఞతలు’ అని తెలియజేసారు. ఎంతైనా బాలయ్యబాబు పైకి అల…కనిపిస్తారు కానీ గొప్పోళ్ళు!