
కుండపోతగా కురిసిన వర్షానికి హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. మరి ముఖ్యంగా పాతనగరం అయితే చిన్నాభిన్నమైంది. వరద నీరు పొంగి ఇళ్లలోకి రావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి లేక ఉండటానికి నిలువ నిడ లేక గోరమైన స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అలాంటి వాళ్ళను పునరవాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలాంటి భారీ వర్షాలు సుమారు 100 సంవత్సరాల తర్వాతే వచ్చిందని తెలుపుతున్నారు. అయితే అలాంటి అనుకోని విపత్తు చూసిన హైదరాబాద్ మహానగరంకు, కలిగిన విపత్తు కారణంగా నష్టపోయిన వారికి సినీ పరిశ్రమ నుంచి ఎవరు విరాళాలు ప్రకటించలేదు. కరోనా సమయంలో ముందుకొచ్చిన సెలెబ్రెటిలు ఇప్పుడు గమ్మున కూర్చున్నారు. కానీ నటసింహం బాలకృష్ణ మాత్రం తన గొప్పతనాన్ని మరోసారి చాటారు. ఈ వర్షాలకు నష్టపోయిన వారికి విరాళంగా బాలయ్య రూ. 1.5కోట్లు ప్రకటించారు. దీంతో బాలయ్య అభిమానులు మా హీరో మనసున్నోడని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.