
గత ఏడాది కరోనా కారణంగా ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు కరోనా పోకపోయిన వాక్సిన్ వచ్చింది అన్ని తెరుచుకున్నాయని ఒక దాని తర్వాత ఒకటి ఓ ప్రవాహం లాగా సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. బ్యాచిలర్స్, సినిమా లవర్స్ అప్పుడే ఆ సినిమాలు చూసేందుకు బడ్జెట్ కూడా వేసుకుంటున్నారు అన్ని రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రవితేజ 'ఖిలాడీ' , బాలకృష్ణ బోయపాటి సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండ ఈ రెండు ఒకే రోజు తలపడుతున్నాయి కూడా. బాలకృష్ణ బోయపాటి మాస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక రవితేజ టైటిలే మాస్ మహారాజ. మరి ఈ రెండు మాస్ చిత్రాల్లో ఏది గెలుస్తుందో చెప్పటం కొంచెం కష్టమే కానీ ఏ సినిమా అయినా కథ బాగుంటే ఆదరించేందుకు జనాలు మాత్రం రెడీగా ఉన్నారని అర్ధం అవుతుంది.