
చాలా రోజులకి మళ్ళీ నందమూరి బాలకృష్ణ ట్రెండ్ అవుతున్నారు. హరీష్ కనుమిల్లిను హీరోగా పరిచయం చేస్తూ 'సెహరి' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ నగరానికి ఏమైంది ఫెమ్ సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిన్న ఈ సినిమా పోస్టర్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల అయింది. ఈమేరకు బాలయ్య మాట్లాడుతూ " కరోనాకు మందు లేదు, రాదు కాబట్టి అందరూ జాగ్రత్తలు వహించాలి. పొద్దునే చనీళ్ల స్నానం మానేయండి, వేడి నీళ్లు తాగండి అన్నారు. అలానే చిత్ర బృందానికి విజయం రావాలని విషెస్ తెలిపారు. అయితే మధ్యలో ఏదో ఫోన్ వస్తే ఫోన్ తీసుకొని పక్కకు విసిరికొట్టారు. బాలయ్య చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో మిమ్స్ కు దారి తీసింది.