
యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది 'అశ్వద్ధామ' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన శౌర్య కరోనా లాక్డౌన్ సమయంలో వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో రెండిటి ఫస్ట్ లుక్స్ ను కూడా రిలీజ్ చేయటం జరిగింది. ఒకటి రైతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న 'వరుడు కావలెను'. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇకపోతే ఫుల్ గా బాడీ బిల్డ్ చేసి ఎంతో బిన్నంగా కనిపించబోతున్న 'లక్ష్య' సినిమా. ఇది కాకుండా 'శ్రీకృష్ణ సత్యభామ' అనే సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నాడు. అసలు విషయం ఏంటంటే నాగశౌర్య, నటసింహం బాలకృష్ణలతో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఒక నూతన దర్శకుడు ఈ మల్టీస్టారర్ ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఇదివరకు మంచు మనోజ్ తో 'ఊకొడతారా ఉల్లిక్కిపడతారా' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.