
నటసింహం బాలకృష్ణ నందమూరి తారకరామారావు గారి కొడుకుగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బాలకృష్ణ కేవలం సినీ పరిశ్రమకే అంకితం అవ్వకుండా బసవతారకం కాన్సర్ ఆసీపీటల్ పేరుతో ఎంతోమందికి కాన్సర్ బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఎన్నో సార్లు ఎంతోమంది కాన్సర్ అనే ముప్పుతో చావు బ్రతుకుల్లో ఉన్న వారికి బసవతారకంలో ఉచితంగా వైద్యసేవలు అందేలా చూసి ప్రాణాలు నిలబెట్టారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ తన గొప్ప మనసును చాటుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ గస్ చేసిన విజయ్ కుమార్ భార్య కాన్సర్ తో బాధపడుతూ బసవతారకంలో చేరారు. ట్రీట్మెంట్ ఖర్చు భరించే స్థోమత విజయ్ కుమార్ కుటుంబానికి లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ బసవతారకంలోని డాక్టర్లకు ప్రత్యేక శ్రద్ధతో విజయ్ కుమార్ భార్యకు చికిత్స చేయమని చెప్పారట. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మా బాలయ్య అంటూ జేజేలు కొడుతున్నారు.