
నటుడు, రాజకీయ నేత నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్య బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి థాంక్స్ చెబుతూ లేఖ రాయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయం ఏంటంటే, సీఎం జగన్ హిందుపూర్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేసారు. హిందుపూర్ ఎమ్మెల్యేగా ఈ విషయం తెలియగానే సీఎం జగన్ ను ధన్యవాదాలు చెబుతూ లేఖ రాసారు. ఆ లేఖలో, హిందుపూర్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మోజురు చేసినందుకు ధన్యవాదాలు. ఈ కాలేజ్ రాకతో ఎంతో మంది రాయలసీమ విద్యార్థులు లాభపడతారు అంటూ మెలుగురు లో కూడా ఒక కాలేజ్ పెడితే బాగుంటుందని అది హిందూపూర్ టౌన్ కు బెంగళూరుకు మధ్యలో ఉంటుందని తెలియజేసారు. మరి, సీఎం జగన్ బాలకృష్ణ ధన్యవాదాలతో పాటు తన సూచనలను కూడా పరిగణిస్తారో లేదో చూడాలి.