
ఈ వయస్సులో సినిమాపై బాలకృష్ణకు ఉన్న అంకితభావం చూస్తుంటే కుర్ర హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే. ఎవరైనా సరే నిజంగా ప్రశంసించాల్సిందే. అతని చివరి మూడు సినిమాల్లో బాలకృష్ణ లుక్ మారుస్తూనే ఉన్నారు. కొత్తదనం కోసం బాలయ్య పడుతున్న కృషి నిరంతరం కనిపిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ వైట్ అండ్ వైట్ లో క్లిన్, హుందా లుక్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి దర్శకత్వంలో వహిస్తున్న సినిమాలో బాలకృష్ణ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. బోయపాటి- బాలయ్య కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం # NBK106 కోసం కాస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.70 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఫిబ్రవరి 2020 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సమాచారం మేరకు కేథరిన్ బాలకృష్ణ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.