
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రాలు "ఎన్టీఆర్ కథానాయకుడు" "ఎన్టీఆర్ మహనాయకుడు" బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయ్యాయి. దీంతో తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బాలయ్య నటించిన 'రులార్' రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బోయపాటితో మరో సినిమా మొదలుపెట్టేసాడు. ఈరోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే నందమూరి అభిమానులకు పండగే. బాలకృష్ణకు వరుస ప్లాప్స్ ఎదురైన సమయంలో బోయపాటి "సింహ" తెరకెక్కించి బాలయ్యకు మంచి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన "లెజెండ్" అంతకు మించి హిట్ కొట్టింది. దీంతో మరోసారి వీరి కాంబోలో వస్తున్న సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.