
నందమూరి బాలకృష్ణకు వయసు మీదపడుతున్నా సినిమాల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా కుర్ర హీరోలతో సమానంగా స్టైల్స్ మారుస్తూ రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. బోయపాటి-బాలయ్య కాంబో అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ బాలయ్యకు ఎవర్ గ్రీన్ చిత్రాలుగా నిలిచిపోతాయి. అలాంటిది వీరి కాంబోలో మూడో సినిమా వస్తుందంటే ఇక అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నారట. విలన్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత హీరోగా మారి స్థిరపడిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా తనకంటూ పదిలమైన సెకెండ్ ఇన్నింగ్స్ ఉండాలని ఫిక్స్ అయ్యాడట. దానికి బోయపాటి- బాలయ్య సినిమా అయితే బాగుంటుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.