
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన తన 151వ సినిమా "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. 100కోట్ల మార్క్ ను అందుకుంది. ఇప్పుడు అదే జోష్ లో కొరటాల శివతో 152వ సినిమా చేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాది 80ల్లో నటులంతా రీయూనియన్ అవుతారన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది మమ్ముట్టి, రాధిక శరత్ కుమార్, మోహన్ లాల్ లాంటి వాళ్ళు హోస్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి ఆ అవకాశం చిరు తీసుకున్నారు. తాజాగా కొత్త ఇంట్లొకి మారిన చిరు, 10వ రీ యూనియన్ ను తన ఇంట్లోనే పెట్టాలని ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుక్కున్నారట. అనుకున్న దాని ప్రకారం ఇంట్లోనే ఈ ఈవెంట్ ను ఆరెంజ్ చేశారు. ఈ ఈవెంట్ కు రజనీకాంత్, మోహన్ లాల్, రాధిక శరత్ కుమార్, జయసుధ, సుహాసిని, సుమన్, నరేష్, వెంకటేష్ ఇలా ఎంతోమంది సెలెబ్రెటీలు వచ్చారు. వచ్చినావారందరికి చిరు స్వయంగా తన చేతులతో డ్రింక్స్ కూడా సర్వ్ చేశారట.అయితే అందరూ వచ్చిన ఈ 80'స్ రీ యూనియన్ లో నటసింహం బాలయ్య మాత్రం మిస్ అయ్యారు. అయితే రూలర్ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో షూటింగ్ లో బిజీగా ఉన్నారట. బాలయ్య ఫొటోస్ లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ మిస్ అయ్యారు.