
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న సినిమా "అల... వైకుంఠపురంలో" సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మొన్ననే పోలీస్ గ్రౌండ్స్ లో మ్యూజికల్ కాన్సర్ట్ జరగగా తాజాగా "బుట్ట బొమ్మ" వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రోమో చూస్తుంటే....బన్నీ డాన్స్ ఇరగతీసినట్లు అర్ధం అవుతుంది. క్లాస్ గెటప్ లో స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ మెలోడీ సాంగ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ స్టైల్ పూజా అందాలు సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.