
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బీబీ3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను త్వరలో మొదలయ్యే షెడ్యూల్ గుంటూరులో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన బాలయ్య – బోయపాటిల సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సింది. ఇక బాలయ్య – బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి అభిమానులు ఇటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 28న సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు దర్శక నిర్మాతలు. బోయపాటి ఇప్పటికే సింహ, లెజెండ్ సినిమాల తో భారీ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు బాలయ్య బీబీ3 మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు.