
బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడప్పుడు చూసిన వాళ్ళకి కూడా మోనాల్ అభిజీత్ అఖిల్ ట్రయాగింల్ ట్రాక్ అర్ధం అవుతుంది. కానీ అది లవ్ ట్రకా లేక ఫ్రెండ్షిప్ ట్రకా అనేది ఎవ్వరికి తెలియదు. ఇది పక్క పెడితే ఆ మధ్య నాగార్జున సైతం మోనాల్ ను A అంటూ ఆటపట్టించారు. A అన్నప్పుడు మురిసిపోవడమో లేదా పట్టించుకోకుండా ఉండటమే చేసేది కానీ అసలు ఆ A అంటే అభిజీతా? అఖిలా? అనేది మాత్రం చెప్పలేదు. నాగార్జున కూడా అడగలేదు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో అభిజీత్ ఈ గుట్టు బయటపెట్టాడు. మోనాల్ అభిజీత్ తో A అంటే నువ్వే, నాకు నువ్వుంటేనే ఇష్టమని చెప్పిందట. కానీ నాగార్జున ముందు మాత్రం ఏ స్టాండ్ తీసుకోలేదు, అబద్దాలు ఆడిందని తన బాధని హారికతో చెప్పుకున్నాడు. అసలే అభికి బయట పిచ్చి క్రేజ్. మరి ఈ గుట్టు బయట పడ్డాక మోనాల్ ఇంట్లో ఉంటుందో లేదా ఈ వారం వెళ్లిపోతుందో చూడాలి.