
బిగ్ బాస్ సీజన్ 4 స్ట్రాంగ్ కంటెస్టేట్ పేరు చెప్పమంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు అభిజీత్. ఇంట్లో సభ్యులు గొడవ పడుతున్న, అరుస్తున్న, ఏడుస్తున్న, వెళ్లిపోతున్నా, తన కుటుంబ సభ్యులు వచ్చిన కళ్ళలో చిన్న కన్నీటి చుక్క రాదు అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఏదైనా తన పాయింట్ ను క్లియర్ గా చెప్పి తెలివిగా అడగల సభ్యుడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా చేస్తూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు . అలాంటి అభిజీత్ నిన్న మొదటిసారి ఏడ్చాడు. అఖిల్,అభిజీత్ మోనాల్ ను ఎక్కువ ఏడిపించిన కారణంగా వారిలో ఒకరు ఆమెను డేట్ కి తీసుకెళ్లాలి అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా...ప్రతిసారి మోనాల్ ను ఎందుకు ఫ్రెమ్ లోకి తెస్తున్నారు, నన్ను ఆమెతో లింక్ చేసి మాట్లాడడం ఇష్టం లేదు, నేను ఏడిపివ్వడం ఏంటి అంటూ ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టాడు. మొదటిసారి ఇంట్లో అభిజీత్ ఏడవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.