
బిగ్ బాస్ సీజన్ 4 ముగిసే దశకు చేరుతుంది. మరో 20 రోజుల్లో గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతుంది. ఈనేపధ్యంలో ఎవరి ఆట వారు ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో రేస్ టు ఫినాలే టాస్క్ ను బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇది గెల్చిన వారు నేరుగా ఫినాలేకు వెళ్తారు. అయితే ఈ టాస్క్ లెవల్ 1 లో అఖిల్, సోహెల్ కలిసి ఆడినట్లుగా తెలుస్తుంది. ఇదే అడిగిన అభి, అవినాష్ పై విరుచుకుపడ్డాడు అఖిల్. ఇక ఏదేమైనా టాస్క్ అంటే సోహెల్ కు ఎక్కడలేని కోపం వస్తదని తెలిసిన విషయమే. అయితే బజర్ మోగినప్పుడల్లా ఆవు నుంచి వచ్చే పాలు తమ బాటిల్స్ లో నింపాల్సి ఉంటుంది. అలా లెవల్ 1 పూర్తయ్యే సమయానికి అవినాష్, అరియానా మరియు మోనాల్ దగ్గర తక్కువ బాటిల్స్ ఉండటంతో వారు టాస్క్ నుంచి తప్పుకున్నారు. ఇక లెవల్ 2 లో అభి,హారిక,అఖిల్ మరియు సోహెల్ పోటీపడనున్నారు. అయితే వీరిలో అఖిల్ సోహెల్ మధ్య చివరి దశ పోటీ నెలకుంటుందని ఎపిసోడ్ ప్రసారం కాకముందే లీకుల ద్వారా తెలుస్తుంది. మరి ఇంతకీ ఈ రేస్ టు ఫినాలేలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.