
బిగ్ బాస్ సీజన్ 4 గురించి మహా అయితే ఇంకో మూడు రోజులు మాట్లాడుకుంటామేమో. కానీ ఈ మూడు రోజుల్లోనే ఎన్ని రూమర్స్, ఎన్ని మిమ్స్. 16 మందితో మొదలైన బిగ్గెస్ట్ రియాల్టీ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అభిజీత్, అఖిల్, సోహెల్, హారిక మరియు అరియనాలు టాప్ 5 లో నిలవగా వారిలో ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠ పెరిగిపోయింది. తమకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తూ ఓట్లు వెయ్యమని సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయ్. అయితే అనధికారిక వోటింగ్ నిర్వహిస్తున్న పలు సోషల్ మీడియా సైట్లు ఒక షాకింగ్ విషయాన్నీ తెలిపాయి. ఆ అనధికారిక ఓటింగ్ లో అభిజీత్ ను వెనక్కి నెట్టి అరియనా ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే అభిజీత్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అలాంటి అభిని వెనక్కి నెట్టి అరియనా ముందుకొచ్చిందంటే విడ్డురమే.