
బిగ్ బాస్ సీజన్ 4 చూస్తుండగానే ఫైనల్ కు చేరువలో ఉంది. 14వ వారంలోకి అడుగుపెట్టారు. అయితే నిన్న సండేను ఫన్ డేగా మార్చిన నాగార్జున ఇంటి నుండి ఒక సభ్యుడిని ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేటి చేసారు. ఇంట్లో ఎప్పుడు సందడి ఉండేలా చూసే ముక్కు అవినాష్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే ఎలిమినేటి అయిన కంటెస్టెంట్స్ ఇంట్లోని వారిలో ఎవరో ఒకరికి బిగ్ బాంబ్ వేసి వెళ్లడం ఆనవాయితీ. అల.. అవినాష్ కు ఈ వారంలో ఒక వ్యక్తి ఇంట్లో ఎటువంటి పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు అనే బిగ్ బాంబ్ ఇవ్వగా దాన్ని అవినాష్ అభిజీత్ పైన వేశాడు. తనకు సోఫా, కాఫీ కప్పు ఉంటే చాలు సర్..వేరే ఇంకేమి అవసరం లేదు అలానే చాల కూల్ గా ఉంటాడు ఎప్పుడు అని చెప్పి ఈ బిగ్ బాంబ్ వేశాడు. ఈ ప్రకారం అభిజీత్ 14వ వారంలో ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు.