
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి వీకెండ్ ఎపిసోడ్లు కాకుండా ఏదైనా ఉందా అంటే అది నిన్నటి ఎపిసోడ్ మాత్రమే. అది కూడా కంటెస్టెంట్స్ వల్ల కాదు వాళ్ళ అమ్మల వల్ల. ముందు రోజు నామినేషన్స్ తో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న సభ్యులు అమ్మలు రాగానే కరిగిపోయారు. ఒక్కసారిగా మనం మనం ఒకటి అంటూ హగ్గులు ఇచ్చుకున్నారు. అఖిల్ అమ్మ వచ్చి అతనికి పుట్టినరోజు విషెస్ తెలిపి ఇంటి సభ్యులతో మాట్లాడుతూ మీరందరు అన్నాతమ్ముళ్లు కొట్లాటలు సహజం అంటూ మంచి మాటలు చెప్పగానే అప్పటి వరకు బద్ర శత్రువుల ఉన్న అఖిల్ అభిజీత్లు కలిసిపోయారు. అభిజీత్ అమ్మ కూడా అదే మాట "మీరు కొట్టుకోవాలి అప్పుడే మజా అంటూ" జోష్ తెచ్చారు. ఇక అవినాష్ అమ్మ అయితే ఏకంగా రెండు స్టెప్పులు వేసి ఇంటి సభ్యులను ఆనందపరిచారు. అలానే హారిక అమ్మ కూడా ముద్దులు ఇచ్చి అందరికి ధైర్యం ఇచ్చారు.