
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 4 ఐదవ వారంకు చేరుకుంది. పోటీదారులందరూ తమ శాయశక్తులమేర ప్రేక్షకులను మెప్పించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. జనాదరణ పొందిన రియాలిటీ షో రోలర్-కోస్టర్ రైడ్ లా మారింది ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియకపోవడంతో అభిమానులు ట్విలకు అతుక్కుపోతున్నారు. అందరికీ తెలిసినట్లుగా, వారాంతపులో నాగార్జున ఓట్ల మెజారిటీను బట్టి ఒకరిని ఎలిమినెట్ చేయటం జరుగుతుంది. అయితే గత రెండు వారాలుగా టాస్క్ లో ఆడిన తీరు, ఇంటి సభ్యులతో మెలిగిన విధానం, ప్రేక్షకులను మెప్పించడంలో చేసిన ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈసారి ఇంటి నుంచి వెళ్లే హౌస్ మెట్ రేస్ లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారే అమ్మ రాజశేఖర్ మరియు సుజాత. ఈ ఇద్దరికి అనధికారిక పోల్స్ లో చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. కానీ బిగ్ బాస్ అసలైన పోలింగ్ లో ఇది తారుమారు అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఇంతకీ ఇంటి నుండి ఎవరు వెళ్తారో రేండు రోజుల్లో తెలుస్తోంది.