
బిగ్ బాస్ లో నిన్నటి నామినేషన్ ప్రక్రియ వేడిక్కింది. ఇద్దరి మధ్య ఫిట్టింగ్ ఎలా పెట్టాలో గొడవలు ఎలా పుట్టించాలో బిగ్ బాస్ కు తెలియదా? అదే జరిగింది...మంచి స్నేహితులుగా క్లోజ్ గా ఉంటున్న మోనాల్ అఖిల్ మధ్య గొడవ వచ్చే విధంగా సెట్ చేసారు. నిన్నటి ప్రక్రియలో ఎర్ర రంగున్న టోపీలు పెట్టుకున్న వారు నామినేట్ అయినట్లుగా పచ్చ రంగున్న టోపీలు పెట్టుకున్న వారు సేవ్ అయినట్లుగా చెప్పిన బిగ్ బాస్ నామినేట్ అయినవారికి సేవ్ అయిన వారిని లోపించి తమ స్థానం తీసుకోమని అడగొచ్చని చెప్పారు. ఈనేపధ్యంలో చర్చకు దిగిన అఖిల్ మోనాల్ మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్ పొద్దున ఒక మాట...సాయంత్రం ఒక మాట మాట్లాడ్తావని నీకు క్లారిటీ లేదంటూ అఖిల్ మోనాల్ ను కించపరిచాడు. దానికి మోనాల్ కూడా నువ్వే కదా ఎవరి గేమ్ వాళ్లు ఆడుకుందాం అని ప్రక్రియకు ముందు చెప్పావు, అదే చేస్తున్న...నా గేమ్ నేను ఆడుతున్న అని అదిరిపోయే జవాబు ఇచ్చింది. దీంతో అఖిల్ మొహం మాడిపోయింది. గత వారాంతపులో వచ్చిన మోనాల్ అమ్మ కూడా ఫెవరెట్ ఎవరు అంటే అభిజీత్ అనడంతో అఖిల్ కు పెద్ద దెబ్బ పడినట్లు అయింది. ఇక ఇప్పుడు మోనాల్ నామినేషన్స్ లో అతన్ని సేవ్ చేయకపోవడంతో ఇంకా పెద్ద దెబ్బ తగిలింది.