
బిగ్ బాస్ సీజన్ 4 నిన్నటితో ముగిసింది. నాగార్జున యాంకరింగ్, అందాల భామల ఆటపాటలతో ఎంత గ్రాండ్ గా జరిగింది. చాలామంది ఊహించినట్లుగానే అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున చేతుల మీదగా ట్రాఫి, 25 లక్షలు మరియు ఒక బైక్ అందుకున్నాడు. అయితే టాప్ 3 తో సరిపెట్టుకున్న సోహెల్ 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసి అందులో 5 లక్షలు తన స్నేహితుడు మెహబూబ్ కు 5 లక్షలు అనాధ పిల్లలకు ఇస్తానని చెప్పాడు. దీంతో నాగార్జున అవసరం లేదు నేనే ఆ 10 లక్షలు ఇస్తానని అన్నారు. దీంతో అప్పటికే సోహెల్ కి 35 లక్షలు వచ్చాయి. ఇక మెగాస్టార్ స్టేజ్ పైకి వచ్చాక టాప్ 2 కంటెస్టెంట్ల గురించి మాట్లాడకుండా సోహెల్ గురించే ఎక్కువ సేపు మాట్లాడారు. నీకొసం సురేఖ మటన్ చేసి పంపించిందని, నువ్వు అనాధ పిల్లలకు డబ్బు ఇస్తా అనడం ఎంతో గొప్ప విషయం ఇక నీ స్నేహితుడు మెహబూబ్ కు నేనే 10 లక్షలు ఇస్తానంటూ చెక్ రాసి ఇచ్చారు. సోహెల్ సినిమాలో తనకు ఒక చిన్న అతిధి పాత్ర ఇస్తే సినిమాను ప్రమోట్ చేస్తానని మెగాస్టార్ సోహెల్ ను ఆకాశానికేస్తారు. ఇదంతా చూస్తుంటే టాప్ 2 కంటెస్టెంట్ల కన్నా సోహెల్, మెహబూబ్ ల మీద నిన్న షో అంత జరిగినట్లుగా ఉంది.