
బిగ్ బాస్ అందరికి కలిసొస్తుందని లేదు అందరికి బెడిసికొడుతుందను లేదు. అదృష్టం మీద ఆదారపడి ఉంటుంది. ఈ కాంట్రవర్షియల్ రియాల్టీ షోలో కనిపించినంత మాత్రాన దశ తిరుగుతుందంటే..అది జరగని పని. ఇందులోకి వచ్చి విమర్శలను ఎదురుకోలేక కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే ప్రతి సీజన్ లో ఫెమస్ టీవీ స్టార్లు, యూట్యూబ్ తారలు, సినీ సెలెబ్రిటీలు కనిపిస్తున్నారు. దానికి కారణం బిగ్ బాస్ వాళ్ళు సంపాదించే కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వటం. అల...సుడిగాలి సినిమాతో ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉన్న మోనాల్ ను తెచ్చిన బిగ్ బాస్ ఆమెకు భారీగానే కట్టబెడుతుంది. ఆమె గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది కాబట్టి వారానికి రూ. 8 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. సీజన్ 4 లో ఉన్న అందరిలోకి ఈమెకి, అవినాష్ కి ఎక్కువ రెమ్యునరేషన్ అని సమాచారం.