
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు రోజుల్లో ముగియనుంది. రేపు 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది. అయితే ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా రి యూనియన్ జరిగింది. మాములుగా అయితే అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు కానీ కోవిద్ దృష్ట్యా కుటుంబ సభ్యులు వచ్చిన మాదిరిగానే ఇద్దరిద్దరు వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లు వచ్చారు. అల వచ్చిన కుమార్ సాయి అందరితో మాట్లాడి, డ్యాన్స్‌లు వేసి అలరించి వెళ్తూ వెళ్తూ అభిజిత్ ఫాలోయింగ్ గురించి చెప్పనకే చెప్పేశాడు. క్రికెట్ ఆడితే.. కెప్టెన్, ఆటగాళ్లకు పేరు వస్తుంది.. కానీ ఎక్కడైనా ఎంపైర్‌కు వస్తుందా? అని అభిజిత్ సంచాలక్ టాస్క్ లను ఉద్దేశించి అన్నాడు. దీంతో అభిజీత్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కుమార్ సాయి చెప్పకనే చెప్పాడు.